Puttaparthi: పోలీసు స్టేషన్ రికార్డులను పరిశీలించిన .. ఎస్పీ

Puttaparthi: పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI
Published on: 21 May 2026 5:18 PM IST
Puttaparthi
X

Puttaparthi: పోలీసు స్టేషన్ రికార్డులను పరిశీలించిన .. ఎస్పీ 

పుట్టపర్తి: రూరల్ పోలీసు స్టేషన్ ను ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తనిఖీ చేసి రికార్డులను, స్టేషన్ పరిసరాలు రిసెప్షన్ కౌంటర్ ను పరిశీలించారు. పెండింగ్‌ కేసులు వాటి స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తులు, వాటి పురోగతి పై కేసుల ఫైళ్ళను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యమైన కేసులు, పాత గ్రేవ్‌ కేసులను సమీక్షించారు. ఎక్కువగా విజిబుల్‌ పోలీసింగ్‌ ,పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, నేర నియంత్రణ కు నివారణ చర్యలు చేపట్టాలన్నారు.

పేకాట , మట్కా, గంజాయి వంటి వాటిని అరికట్టే విధంగా గట్టి చర్యలు చేపట్టాలన్నారు. బాధితులు పోలీసుస్టేషన్ ను ఆశ్రయించినప్పుడు వారి సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. సైబర్ నేరాల పై, మహిళా చట్టాల పై మహిళలకు , నూతన చట్టాల పై ప్రజలకు అవగాహన చేయాలన్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. ఎస్పీ తో పాటు, సిఐ సురేష్, ఎస్సై క్రాంతి కుమార్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI

SHAIKH FIROZ, PUTTAPARTHI

Next Story