Proddatur: ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల రాజకీయం వేడెక్కెను!

Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరులో మున్సిపల్ ఎన్నికలపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిపై విమర్శలు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 1 Oct 2026 1:13 PM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల రాజకీయం వేడెక్కెను!

Proddatur: రాబోయే దసరా పండుగలోపే మునిసిపల్ ఎన్నికలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని ప్రొద్దుటూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

నియమ నిబంధనలు, రిజర్వేషన్ ప్రక్రియ ప్రకారం ఎన్నికల్లో అన్ని కులాల వారికి సముచిత అవకాశం కల్పించాలని రాచమల్లు డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరు మునిసిపాలిటీ పరిధిలో అత్యధికంగా బీసీ ఓటర్లు ఉన్నారని, జిల్లా కలెక్టర్ కూడా బీసీలకు కేటాయిస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారని వెల్లడించారు. బీసీలకు చెందాల్సిన ఛైర్మన్ స్థానాన్ని ఓసీ జనరల్ కు కేటాయించాలంటూ స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి టీడీపీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారని రాచమల్లు ఆరోపించారు.

ఒకవేళ ఛైర్మన్ పదవిని ఓసీలకు కేటాయిస్తే, తన సొంత తమ్ముడు రాఘవ రెడ్డికి లేదా వ్యవహరించే మహేశ్వర రెడ్డికి కట్టబెట్టాలనే చుస్తున్నారని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యేకు ప్రజలన్నా, ప్రభుత్వ ఉద్యోగులన్నా కనీస గౌరవం లేదని, పలు సందర్భాల్లో వారిని బహిరంగంగా అవమానించిన దాఖలాలు ఉన్నాయని రాచమల్లు మండిపడ్డారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR