Kodur: పోలీసుల అచేతనం: ఒకే రోజు 210 మందికి గంజాయి పరీక్షలు!

Kodur: తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో గంజాయి టెస్ట్ కిట్లతో 210 మందికి పోలీసులు పరీక్షలు చేశారు. మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు ఉంటాయని సీఐ హెచ్చరించారు.

PRASAD, KODURU
Published on: 7 Aug 2026 5:43 PM IST
Kodur
X

Kodur: పోలీసుల అచేతనం: ఒకే రోజు 210 మందికి గంజాయి పరీక్షలు!

జిల్లా తిరుపతి:

రైల్వే కోడూరు టౌన్‌లో 210 మందికి గంజాయి పరీక్షలు

తిరుపతి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎల్. సుబ్బరాయుడు, IPS ఆదేశాల మేరకు, రేణిగుంట డీఎస్పీ శ్రీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో, రైల్వే కోడూరు సీఐ శ్రీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రైల్వే కోడూరు టౌన్‌లో గంజాయి వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా చిట్వేల్ రోడ్‌లోని హాస్పిటల్ సమీపంలో గంజాయి టెస్ట్ కిట్లను ఉపయోగించి మొత్తం 210 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించడం జరిగింది.

అలాగే, గంజాయి వినియోగం మరియు విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు పోలీసు సమాచారదారుల వ్యవస్థను మరింత బలోపేతం చేసి, గంజాయి సరఫరా చేసే వ్యక్తులు, విక్రయదారులు మరియు వినియోగదారుల కదలికలపై నిఘా ఉంచుతున్నామని అధికారులు తెలిపారు.

ప్రజలు గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలియజేసి సహకరించాలని కోరారు. అలాగ సమాచారం అందించిన వారి వివరాలు చాలా గోప్యం గా ఉంచబడతాయని తెలిపారు

అదేవిదంగా యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసు శాఖ తరఫున నిరంతరం చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం మరియు సరఫరాకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

PRASAD, KODURU

PRASAD, KODURU

Next Story