T Sundupalli: కమ్ముగుట్టపల్లె హరిజనవాడలో తీరిన తాగునీటి సమస్య!
T Sundupalli: సుండుపల్లి మండలం కమ్ముగుట్టపల్లె హరిజనవాడలో తాగునీటి సమస్య పరిష్కారమైంది. రాజంపేట టీడీపీ ఇన్‌చార్జ్ చమ్మర్తి జగన్‌మోహన్ రాజు పైపులైన్ వేయించారు.
T Sundupalli: కమ్ముగుట్టపల్లె హరిజనవాడలో తీరిన తాగునీటి సమస్య!
T Sundupalli: సుండుపల్లి గ్రామం, కమ్ముగుట్టపల్లె హరిజనవాడకు చెందిన గ్రామస్తులు తమకు ఉన్న తాగునీటి సమస్యను రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీ చమ్మర్తి జగన్‌మోహన్ రాజు గారి దృష్టికి తీసుకెళ్లారు.
గ్రామస్తుల సమస్యను వెంటనే స్పందించిన శ్రీ చమ్మర్తి జగన్‌మోహన్ రాజు గారు పంచాయతీ అధికారులతో మాట్లాడి, హరిజనవాడకు పైపులైన్ ఏర్పాటు చేసి తాగునీరు అందించేలా చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా తమ సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపిన శ్రీ చమ్మర్తి జగన్‌మోహన్ రాజు గారికి కమ్ముగుట్టపల్లె హరిజనవాడ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల సీనియర్ నాయకులు మాలేపాటి శివరామ నాయుడు, క్లస్టర్ ఇన్‌చార్జ్ గోనిగుంట్ల మోహన్ బాబు నాయుడు, మండల బీసీ సెల్ అధ్యక్షులు మంగిరి సురేష్ ఆకుల శివ కుమార్ బూత్ కన్వీనర్ మళ్ళీ తో పాటు ఇతర టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి, వెంటనే పరిష్కరించేందుకు టీడీపీ నాయకత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని నాయకులు తెలిపారు.




