Rajampet: శ్రీమంతుడులా సొంత ఖర్చులతో రోడ్డు వేయించిన ఎన్ఆర్ఐ
Rajampet: రాజంపేట పరిధిలో అధికారులు పట్టించుకోని రోడ్డును కువైట్ నుండి వచ్చిన ఎన్ఆర్ఐ షేక్ నౌషద్ అలీ తన సొంత ఖర్చులతో బాగుచేయించి శ్రీమంతుడు సినిమాను తలపించారు.
Rajampet: శ్రీమంతుడులా సొంత ఖర్చులతో రోడ్డు వేయించిన ఎన్ఆర్ఐ
రాజంపేట: కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని వీరబల్లి మండలం దిగువరాచపల్లి గ్రామ పంచాయతీలోని వంగిమళ్ళ పెద్దూరు కస్పాలో రహదారి దెబ్బతింది. దీంతో అప్పుడప్పుడు కురిసే వర్షాలు కారణంగా నడిరోడ్డు పై వర్షపు నీరు వచ్చి చేరుతుంది.
దీంతో రహదారి పై గుంతలు ఏర్పడి కుంటలాగా తలపించేది. దెబ్బతిన్న రోడ్డు బాగుచేయాలని ఎన్నోసార్లు అటు పాలకులకు, ఇటు అధికారులకు గ్రామస్తులు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు.
దీంతో కువైట్ లో ఉంటూ ఇటీవల స్వగ్రామానికి వచ్చిన షేక్ నౌషద్ అలీ అనే యువకుడు శ్రీమంతుడు లాగా ముందుకొచ్చి తన సొంత ఖర్చులతో సోమవారం జెసిబి, ట్రాక్టర్లుతో ఎర్ర మట్టి తోలించి రోడ్డును బాగు చేయించాడు.
దీంతో రాకపోకలకు సులభతరం అయ్యింది. ప్రజాప్రతినిధులు, అధికారులు చేయలేని పనిని యువకుడు నౌషద్ అలీ ముందుకొచ్చి తన సొంత నిధులు ఖర్చు చేసి రోడ్డు బాగు చేయడం పై గ్రామస్తులు ఆ యువకుడుని అభినందించి హర్షం వ్యక్తం చేశారు.




