Rajampet: చమర్తి రవీంద్ర రాజు దశదిన కర్మలో పాల్గొన్న జగన్మోహన్ రాజు
Rajampet: టీడీపీ సీనియర్ నాయకుడు చమర్తి రవీంద్ర రాజు మృతి పార్టీకి తీరని లోటని రాజంపేట టీడీపీ ఇన్‌చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు పేర్కొన్నారు.
Rajampet: చమర్తి రవీంద్ర రాజు దశదిన కర్మలో పాల్గొన్న జగన్మోహన్ రాజు
రాజంపేట: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చమర్తి రవీంద్ర రాజు మృతి పార్టీకి తీరని లోటని,మంచి ఆప్తుడిని కోల్పోయామని రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు అన్నారు.గురువారం రాజంపేట నియోజకవర్గ పరిధిలోని వీరబల్లి మండలం ఓదివేడు గ్రామపంచాయతీలోని రామాపురంలో జరిగిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చమర్తి రవీందర్ రాజు దశదిన కర్మ కార్యక్రమంలో రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ఆయన రవీంద్ర రాజు చిత్రపటానికి పూలమాలలు ఘనంగా నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.భవిష్యత్తులో రవీంద్ర రాజు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వీరబల్లి మండల టిడిపి అధ్యక్షుడు బానుగోపాల్ రాజు,తెలుగుదేశం సీనియర్ నాయకులు రెడ్డప్పరెడ్డి,మట్లి గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ నాగార్జున చారి,మట్లి సహకార సొసైటీ చైర్మన్ రాజా నాయుడు,ఓదివేడు మాజీ సర్పంచ్ వెంకటరామరాజు, కల్లూరి రామ్మోహన్ రెడ్డి,మట్లీ సొసైటీ మెంబర్ దుర్గం ఆంజనేయులు,భాస్కర్ రాజు,బిజెపి నాయకులు నరేంద్ర,భాస్కర,భాస్కర్ రాజు సీతారామరాజు,సిద్దిరాజు,రమేష్ రాజు, సుధాకర్,రవిరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,ఓదివేడు గ్రామప్రజలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.




