Rayachoty: మంత్రులు, అధికారులను కలిసిన సుగవాసి ప్రసాద్ బాబు!

Rayachoty: రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్‌లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి, మంత్రులు గొట్టిపాటి, మండిపల్లిలను రాజంపేట పార్లమెంట్ TDP అధ్యక్షుడు ప్రసాద్ బాబు కలిశారు.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 5 Sept 2026 1:27 PM IST
Rayachoty
X

Rayachoty: మంత్రులు, అధికారులను కలిసిన సుగవాసి ప్రసాద్ బాబు!

Rayachoty: అన్నమయ్య జిల్లా రాయచోటిలోని స్టేట్ గెస్ట్ హౌస్ నందు జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి , విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ , రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి , జోనల్ కోఆర్డినేటర్ దామాచర్ల సత్య గారు, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పలువురు అధికారులను రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో రాజంపేట పార్లమెంట్ పరిధిలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై స్నేహపూర్వకంగా చర్చించారు.అన్నమయ్య జిల్లా అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన పాలన మరియు సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు,అధికారుల సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వివరించారు. అనంతరం మంత్రులను శాలువా కప్పి ఘనంగా సత్కరించి, వారి సేవలకు అభినందనలు తెలియజేశారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI