Kadapa: బీటెక్ రవి ఆదేశాలతో రంగంలోకి రామమునిరెడ్డి
Kadapa: కడప జిల్లా వేంపల్లిలో సర్వమత సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం.
Kadapa: బీటెక్ రవి ఆదేశాలతో రంగంలోకి రామమునిరెడ్డి
కడప: నియోజకవర్గ బాద్యుడు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి(బిటెక్ రవి) ఆదేశాల మేరకు ఆర్యవైశ్యులకు శ్మశాన వాటిక ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు టిడిపి మండల కన్వీనర్ రామమునిరెడ్టి అన్నారు. శుక్రవారం స్థానిక పాపాగ్నీనది శివారు ప్రాంతాన్ని కన్వీనర్ రామమునిరెడ్టి పరిశీలించారు. అనంతరం ఆర్యవైశ్యులతో కలిసి చర్చించారు.
శ్మశాన వాటికకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతామని వెల్లడించారు. దీంతో బిటెక్ రవి, రామమునిరెడ్టి, అధికారులకు ఆర్యవైశ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టిడిపి కూటమి ప్రభుత్వం పని చేస్తోందని కన్వీనర్ రామమునిరెడ్టి అన్నారు.
Next Story




