Rayachoti: హసనాపురంలో సీతారాముల ఆలయ నిర్మాణానికి భూమి పూజ!

Rayachoti: హసనాపురంలో శ్రీవాణి ట్రస్ట్ రూ.46 లక్షల వ్యయంతో సీతారాముల ఆలయ నిర్మాణం. భూమి పూజ నిర్వహించిన టీడీపీ నేత డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 13 Sept 2026 1:32 PM IST
Rayachoti
X

Rayachoti: హసనాపురంలో సీతారాముల ఆలయ నిర్మాణానికి భూమి పూజ!

Rayachoti: రామాపురం మండలం హసనాపురం గ్రామంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూ.46 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీతారాముల దేవాలయానికి తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు భూమి పూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి శ్రీవాణి ట్రస్ట్ అందిస్తున్న సహకారం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సీతారాముల దేవాలయ నిర్మాణంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత పెంపొందడంతో పాటు, భక్తులకు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుందని డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు తెలిపారు.

ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా దేవాలయ నిర్మాణానికి సహకారం అందించడం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI