Rayachoti: స్వయంగా అమ్మవారి పల్లకి మోసిన మంత్రి మండిపల్లి!

Rayachoti: శ్రీ విరూపాక్షమ్మ తల్లి జాతర మహోత్సవాల చివరి రోజు జరిగిన పల్లకి ఊరేగింపులో రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన సతీమణి హరితమ్మ ప్రత్యేక పూజలు చేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 18 July 2026 11:30 PM IST
Rayachoti
X

Rayachoti: స్వయంగా అమ్మవారి పల్లకి మోసిన మంత్రి మండిపల్లి!

రాయచోటి: విరూపాక్షమ్మ తల్లి జాతర మహోత్సవాల చివరి రోజు నిర్వహించిన అంగరంగ వైభవమైన పల్లకి ఊరేగింపు కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి , వారి సతీమణి హరితమ్మ , కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా మంత్రి భక్తిశ్రద్ధలతో అమ్మవారి పల్లకిని స్వయంగా మోసి తన భక్తిని చాటుకున్నారు. జాతరలో పాల్గొన్న భక్తుల మధ్య అమ్మవారి పల్లకి ఊరేగింపు అత్యంత వైభవంగా సాగి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది.

ఈ పవిత్ర కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి , వారి సతీమణి సౌమ్య రెడ్డి , మంత్రి గారి కుమారుడు మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి , కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని ప్రార్థించారు.

"భక్తి, సంప్రదాయం, సంస్కృతి కలిసిన విరూపాక్షమ్మ తల్లి జాతర... వేలాది మంది భక్తుల నడుమ వైభవంగా ముగిసి భక్తుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచింది.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story