Kadapa: పాత సీసాలో కొత్త సారా.. కడప స్టీల్ ప్లాంట్‌పై వైసీపీ ఫైర్!

Kadapa: ఎన్నిసార్లు శంకుస్థాపన చేస్తారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష ప్రశ్నించారు

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 Jun 2026 3:14 PM IST
Kadapa
X

Kadapa: పాత సీసాలో కొత్త సారా.. కడప స్టీల్ ప్లాంట్‌పై వైసీపీ ఫైర్!

కడప:స్టీల్ ప్లాంట్ కోసం ఎన్నిసార్లు ఫౌండేషన్ స్టోన్ వేస్తారని,పాత సీసాలో కొత్త సారా అన్న చందంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని వైసిపి కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి,మాజీ ఉపముఖ్యమంత్రి అంజద్ భాష ఆరోపించారు.

కడప వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవీంద్రనాథ్ రెడ్డి, అంజద్ భాష మాట్లాడుతూ జులై మూడో తేదీన జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ ఫౌండేషన్ స్టోన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు వేయడాన్ని స్వాగతిస్తున్నామని కేవలం ఫౌండేషన్ స్టోన్ లాకే పరిమితం కాకుండా మూడు సంవత్సరాల లో స్టీల్ ఫ్యాక్టరీని పూర్తిచేసి ప్రారంభించాలని కోరారు.

జగన్మోహన్ రెడ్డి హయాంలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేసి పనులను కూడా ప్రారంభించడం జరిగిందని కూటమి ప్రభుత్వం వచ్చాక జిందాల్ స్టీల్ ప్లాంట్ వారిపై కేసులు పెట్టడంతో పనులు ఆగిపోయాయని గుర్తుకు చేశారు.

గత వైసీపీ ప్రభుత్వంలో స్టీల్ ప్లాంట్ లో ఎంత మేరకు పనులు జరిగాయో పరిశీలించేందుకు వైసిపి కి చెందిన జిల్లా పార్టీ నాయకులు పరిశీలించేందుకు వెళ్తున్నామని గత ప్రభుత్వ హయాంలో ఎంత పనులు జరిగాయో ప్రజలకు తెలియజేసేందుకే ఈ పర్యటన ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story