Rayachoti: రాయచోటి డీజే ఓనర్స్ అసోసియేషన్ రక్తదాన శిబిరం
Rayachoti: రాయచోటిలో సౌండ్ సిస్టం డీజే ఓనర్స్ అసోసియేషన్ రక్తదాన శిబిరం. సుగవాసి ప్రసాద్ బాబు, డీఎస్పీ కృష్ణమోహన్ చేతుల మీదుగా ప్రారంభం. యువతకు పిలుపు.
Rayachoti: రాయచోటి డీజే ఓనర్స్ అసోసియేషన్ రక్తదాన శిబిరం
రాయచోటి: అన్నమయ్య జిల్లా సౌండ్ సిస్టం డీజే ఓనర్స్ అసోసియేషన్ తొలి వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, సుగవాసి ప్రసాద్ బాబు గారు, డీఎస్పీ శ్రీ కృష్ణమోహన్ గారు కలిసి రాయచోటి రాజధాని కళ్యాణమండపంలొ ఘనంగా ప్రారంభించారు..
ఈ సందర్భంగా శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు మాట్లాడుతూ రక్తదానం అనేది కేవలం ఒక దానం కాదు... అది మరో మనిషికి కొత్త జీవితాన్ని అందించే మహోన్నత సేవ. ప్రమాదాలు, అత్యవసర చికిత్సలు, ప్రసవాలు, శస్త్రచికిత్సల సమయంలో రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి సమయంలో స్వచ్ఛందంగా రక్తదానం చేసే ప్రతి ఒక్కరూ నిజమైన ప్రాణదాతలు." అని పేర్కొన్నారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆరోగ్యవంతుడు క్రమం తప్పకుండా రక్తదానం చేసి సమాజానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం వల్ల శరీరానికి ఎటువంటి హాని ఉండదని, పైగా ఆరోగ్యపరంగా కూడా ప్రయోజనాలు ఉంటాయని వివరించారు..
ఈ సందర్భంగా రక్తదానం చేసిన ప్రతి యువకుడికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, నిర్వాహకులు వారికి ప్రశంసాపత్రాలు అందించి సత్కరించారు.




