Rayachoti: బోరెడ్డిగారిపల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్!

Rayachoti: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలోని తన స్వగృహంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించి వినతులు స్వీకరించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 24 Nov 2026 9:27 AM IST
Rayachoti
X

Rayachoti: బోరెడ్డిగారిపల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్!

రాయచోటి: చిన్నమండెం మండలం బోరెడ్డిగారి పల్లెలోని తన స్వగృహంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను, వ్యక్తిగత ఇబ్బందులను, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన వినతులను మంత్రికి వివరించారు.

ప్రజలు తెలిపిన ప్రతి సమస్యను మంత్రి ఓపికగా ఆలకించి, వినతులను స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడటంతో పాటు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయడమే ప్రజా దర్బార్ ప్రధాన ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు స్పందిస్తూ, వారి సంక్షేమం మరియు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI