Rayachoti: రాయచోటిలో దళిత మహిళ స్థలం ధ్వంసం.. సిపిఐ లిబరేషన్ ఆగ్రహం!
Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో దళిత మహిళ సుధారాణి స్థలంలో గుణాదిని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ డిమాండ్ చేసింది.
Rayachoti: రాయచోటిలో దళిత మహిళ స్థలం ధ్వంసం.. సిపిఐ లిబరేషన్ ఆగ్రహం!
అన్నమయ్య జిల్లా: రాయచోటి లో దళిత రాలైన మంచింటి సుధారాణి గునాదిని ధ్వంసం చేసిన అగ్రవర్ణలస్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ (ఎంఎల్ )లిబరేషన్ పార్టీ అన్నమయ్య జిల్లా కార్యదర్శి విశ్వనాథ్ డిమాండ్ చేశారు మంగళవారం రాయచోటి టౌన్ అయ్యప్ప స్వామి గుడి దగ్గర ధ్వంసం చేసిన స్థలాన్ని అయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేనెంబర్ 592/1 ప్లాట్ నెంబరు 28 లో మూడు సెంట్లు స్థలం 2013లో ప్రభుత్వం వారు. మంచింటి సుధారాణి పేరుతో డిపారం ఇవ్వడం జరిగిందన్నారు తర్వాత ఆమే గుణాది వేసుకోవడం జరిగింది అన్నారు అదేవిధంగా కోర్టు పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉన్నదని ఆయన తెలిపారు అయినప్పటికీ కూడా కొంతమంది అగ్రవర్ణ. కులస్తువులు కొఃత మంది వారం క్రితం జేసిపి యంత్రంతో గునాదిని ధ్వంసం చేసి చదును చేయడం చాల దారుణమైన విషయం అన్నారు ఇప్పటికైనా వెంటనే. రెవెన్యూ అధికారులు స్పందించి సమస్యను పరిష్కారం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బాధితులు సుధారాణి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




