Rayachoti: సంబేపల్లిలో జోరుగా డోర్ టు డోర్ కార్యక్రమం
Rayachoti: రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి మండలంలో డోర్ టు డోర్ కార్యక్రమం. పల్లెల సమగ్రాభివృద్ధే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లక్ష్యమని వెల్లడి.
Rayachoti: సంబేపల్లిలో జోరుగా డోర్ టు డోర్ కార్యక్రమం
రాయచోటి: రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి మండలం నారాయణరెడ్డి గారి పల్లిగ్రామం లొ డోర్ టు డోర్ నిర్వహించారు. పల్లెల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా, వాటిని ప్రగతి పథంలో నడిపించడమే రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రధాన లక్ష్యమని మండల క్లస్టర్ ఇంచార్జ్ G విష్ణువర్ధన్ రెడ్డి, పేర్కొన్నారు.
సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి అనేవి మంత్రి రాంప్రసాద్ రెడ్డికి రెండు కళ్ల లాంటివని, అహర్నిశలు ప్రజా శ్రేయస్సు కోసమే ఆయన పరితపిస్తున్నారని కొనియాడారు.
నియోజకవర్గ నాయకులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి, యువ నాయకులు మౌర్యా రెడ్డి ల ఆదేశాలు మేరకు సంబేపల్లి మండలంలో ని నారాయణ రెడ్డి గారిపల్లి,మద్రి వాండ్లj పల్లి,ప్రకాష్ నగర్ కాలనిలో స్థానిక నేతలతో కలిసి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు చేరువ చేయాల్సిన సంక్షేమ పథకాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. పల్లె సీమలను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలపడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ కో-ఛైర్మన్ హరిప్రసాద్ యాదవ్, మాజీ సర్పంచ్ శశిధర్ రెడ్డి, మరియు ఇతర మల్లికార్జున నాయుడు, గణేష్, శివ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




