Rayachoti: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన ఇద్దరి అరెస్ట్

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై ఎక్సైజ్ పోలీసులు కొరడా ఝుళిపించారు.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 24 Jun 2026 9:33 AM IST
Rayachoti
X

Rayachoti: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన ఇద్దరి అరెస్ట్

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గురుప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా బస్టాండ్ దగ్గర ఉన్న డైట్ స్కూల్ దగ్గర బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న అనుమతించిన పర్మిట్ రూమ్‌లలో మాత్రమే మద్యం సేవించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినట్లయితే చట్టపరమైన చర్యలు, కేసులు నమోదు చేసి శిక్షలు అమలు చేస్తామని హెచ్చరించారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story