Rayachoti: రాయచోటిలో 4 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల!
Rayachoti: రాయచోటి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 4 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 19 వరకు దరఖాస్తులు స్వీకరించి, 21న లాటరీ తీయనున్నారు ఎక్సైజ్ సీఐ గురుప్రసాద్.
Rayachoti: రాయచోటిలో 4 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల!
రాయచోటి: రాయచోటి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాలుగు మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. రాయచోటి రూరల్, చిన్నమండెం, వీరబల్లి, సుండుపల్లి మండలాల్లో ఒక్కో దుకాణానికి లైసెన్స్ జారీ చేయనున్నారు.
ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రిలోపు దరఖాస్తులు సమర్పించాలి. ఈ నెల 21న మదనపల్లె కలెక్టరేట్‌లో లాటరీ ద్వారా లైసెన్సులు కేటాయించనున్నారు. లైసెన్స్ పొందిన వారు ఏడాదికి రూ.60.50 లక్షల ఫీజుతో పాటు రూ.5 లక్షల పర్మిట్ రూమ్ ఫీజు చెల్లించాలి.
వివరాలకు రాయచోటి ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌ను 9866962286 నంబరులో సంప్రదించాలని ఇన్‌స్పెక్టర్ వై. గురుప్రసాద్ తెలిపారు.




