Rayachoti: రాయచోటిలో పేదరాలి ప్రభుత్వ స్థలం కబ్జా యత్నం
Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రభుత్వ స్థలానికి నకిలీ పట్టాలు సృష్టించి కబ్జా చేస్తున్నారంటూ బాధితురాలు అరుణ కన్నీటి పర్యంతం. న్యాయం చేయాలని వేడుకోలు.
Rayachoti: రాయచోటిలో పేదరాలి ప్రభుత్వ స్థలం కబ్జా యత్నం
రాయచోటి: పేదలకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాలపై అక్రమార్కుల కన్ను పడింది. కబ్జాదారులు నకిలీ పట్టాలు సృష్టించి ఏకంగా అక్రమ నిర్మాణాలకు సైతం తెగబడుతున్నారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన అసలైన లబ్ధిదారులపై దౌర్జన్యానికి దిగుతూ, భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో చోటుచేసుకుంది. అక్రమార్కుల కబ్జా నుండి తన స్థలాన్ని కాపాడి, తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు అరుణ మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా బాధ్యతరాల అరుణ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా రాయచోటి లోని మదనపల్లె రోడ్డు మార్గంలో రాయుడు కాలనీకి ఎదురుగా ఉన్న షిబకతుల్లా కాలనీలో 2008వ సంవత్సరంలో ప్రభుత్వం నా పేరు అరుణతో ప్లాట్ నెంబర్ 71 ని మంజూరు చేసిందన్నారు తన ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో ఆస్థలంలో గృహ నిర్మాణం చేపట్టలేకపోయారన్నారు.
దీనిని ఆసరాగా చేసుకున్న కబ్జాదారులు, నా ప్లాట్‌కు నకిలీ పట్టాలు సృష్టించి ,ఇతరులకు విక్రయించరన్నారు.వారు ఇప్పుడు అక్కడ అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారన్నారు.ప్రశ్నిస్తే అసభ్య పదజాలంతో దూషణ దిగుతున్నారన్నారు. గతంలో కూడా సదరు వ్యక్తులు అక్రమ నిర్మాణం చేపట్టగా తాను , తన భర్త అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నామన్నారు . మళ్లీ నిర్మాణాలు మొదలుపెట్టారన్నారు.
ప్రభుత్వం మాకు మంజూరు చేసిన నివాస స్థలంలో మీరేలా నిర్మాణం చేపడతారని ప్రశ్నించామన్నారు. వారు దౌర్జన్యానికి దిగిగరాని,నీకు దిక్కున్న చోట చెప్పుకో, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ చెప్పుకోలేని విధంగా అసభ్య పదజాలంతో మాట్లాడుతూ తనను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బాధితురాలు వాపోయారు.అధికారులు స్పందించి,అక్రమార్కుల నుండి తన స్థలాన్ని కాపాడాలని, రెవెన్యూ అధికారులు, పోలీసులు తక్షణమే స్పందించి, విచారణ జరిపి నిరుపేదలైన తమకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు.




