Rayachoti: పదవీ విరమణ పొందిన ఆర్మీ జవాన్ రేపన గంగాధర్‌కు ఘన స్వాగతం
Rayachoti: భారత సైన్యంలో 20 సంవత్సరాలు సేవలుందించి పదవీ విరమణ పొందిన రాయచోటికి చెందిన రేపన గంగాధర్‌కు స్థానికులు ఘన స్వాగతం పలికారు.
Rayachoti: పదవీ విరమణ పొందిన ఆర్మీ జవాన్ రేపన గంగాధర్‌కు ఘన స్వాగతం
రాయచోటి: ఈరోజు నా జీవితంలో అత్యంత భావోద్వేగ పూరితమైన రోజు. ఇన్నాళ్లపాటు దేశ రక్షణ కోసం భారత సైన్యంలో సేవలు అందించి, ఈరోజు పదవీ విరమణ చేయడం నాకు గర్వంగాను, అదే సమయంలో నా సైనిక కుటుంబానికి దూరమవుతున్నాననే బాధగా ఉంది.
2004 ఇండియా ఆర్మీ లో జాయిన్ అయ్యి 2006 నుంచి 2007 వరకు రాజస్థాన్ లో 2007 నుంచి 2010 వరకు హర్యానా 2010 నుంచి 2012 జమ్మూ 2012 నుంచి 2014 పంజాబ్ లో 2015 నుంచి 2016 మళ్లీ జమ్మూ లో 2017 నుంచి 2020 మహారాష్ట్ర అహ్మద్ నగర్ ఏసీఎస్ మరియ స్కూల్ ట్రైనింగ్ సెంట్రల్ ఇన్సిట్యూన్ లో 2020 నుంచి 2023 జార్కండ్ 2023 నుంచి ప్రస్తుతం పదవీ విరమణ పొందినది రాజస్థాన్.
భారత మాత రక్షణలో భాగస్వామిని కావడం, ఈ యూనిఫామ్ సైనిక దుస్తులుధరించడం నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సరిహద్దుల్లో కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశప్రజల రక్షణే ధ్యేయంగా నా బాధ్యతలను పూర్తి చేశాను.నేను సరిహద్దుల్లో ఉన్నప్పుడు నా కుటుంబం ఎన్నో కష్టాలను ఓర్చి నాకు అండగా నిలిచింది. నా భార్య, పిల్లలు, తల్లిదండ్రుల మిత్రలు మద్దతు లేకపోతే నేను ఇంతకాలం ప్రశాంతంగా దేశ సేవ చేయలేకపోయేవాడిని.
నేను సైన్యం నుండి భౌతికంగా రిటైర్ అవుతున్నప్పటికీ, ఒక సైనికుడిగా నా దేశానికి సేవ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. సమాజ సేవలో లేదా యువతకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాల్లో నా వంతు పాత్రను ఇకపై పోషిస్తాను.చివరిగా, నా సేవా కాలంలో నాకు సహకరించిన నా పై అధికారులకు, తోటి జవాన్లకు మరియు నన్ను ఎల్లప్పుడూ దీవించిన దేశ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారు ఉమేష్ యాదవ్ గంగి రెడ్డి (Ex ఆర్మీ )నంద యాదవ్, కొండ రెడ్డి, గజేంద్ర నాయుడు మరియు ఫ్రైండ్స్ బందు మిత్రులు పాల్గొన్నారు.




