Rayachoti: కొత్త బోరులో మూడు ఇంచుల నీరు మంత్రి మండిపల్లికి కృతజ్ఞతలు

Rayachoti: రాయచోటి రాయుడు కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారం. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవతో వేసిన బోరులో పడిన మూడు ఇంచుల నీరు, ప్రజల హర్షం.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 23 Sept 2026 11:45 PM IST
Rayachoti
X

Rayachoti: కొత్త బోరులో మూడు ఇంచుల నీరు మంత్రి మండిపల్లికి కృతజ్ఞతలు

రాయచోటి: రాయచోటి పట్టణంలోని రాయుడు కాలనీ గంగమ్మ గుడి సమీపంలో స్థానిక ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి నీటి బోరు ఏర్పాటు చేయించారు.

మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి చొరవతో ఏర్పాటు చేసిన బోరులో మూడు ఇంచుల నీరు లభించడంతో రాయుడు కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల తాగునీటి సమస్యలను గుర్తించి, అవసరమైన చోట బోర్లు ఏర్పాటు చేస్తూ సమస్యల పరిష్కారానికి మంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని స్థానికులు తెలిపారు.

గంగమ్మ గుడి సమీపంలో నీటి సమస్యకు పరిష్కారం చూపి బోరు ఏర్పాటు చేయించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి రాయుడు కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజల ఆశీస్సులు, అభిమానమే మండిపల్లి రాముడికి బలమని మంత్రి ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని వారు పేర్కొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI