Rayachoti: వీరభద్రస్వామి జయంతి మహోత్సవాల్లో మంత్రి మండిపల్లి

Rayachoti: రాయచోటిలో వీరభద్రస్వామి జయంతి మహోత్సవాల్లో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 15 Sept 2026 11:14 PM IST
Rayachoti
X

Rayachoti: వీరభద్రస్వామి జయంతి మహోత్సవాల్లో మంత్రి మండిపల్లి

రాయచోటి: రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ వీరభద్రస్వామి జయంతి మహోత్సవాల్లో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొన్నారు.

జయంతి మహోత్సవాల సందర్భంగా ఆలయానికి విచ్చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతంతో ఘనంగా ఆహ్వానం పలికారు. అనంతరం మంత్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య మంత్రికి ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.

శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామివారి జయంతి మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారిని సేవించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

వీరభద్రస్వామివారి దివ్య ఆశీస్సులతో అన్నమయ్య జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ పవిత్ర జయంతి మహోత్సవాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI