Rayachoti: రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వివాహ వేడుక సందడి!
Rayachoti: రాయచోటిలో వెంకట్రామిరెడ్డి - అపర్ణ వివాహ వేడుకలో ఆంధ్రప్రదేశ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Rayachoti: రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వివాహ వేడుక సందడి!
రాయచోటి: అన్నమయ్య జిల్లా, రాయచోటి పట్టణంలోని చిత్తూరు బైపాస్ రోడ్డులో ఉన్న రాజధాని కళ్యాణ మండపంలో వెంకట్రామిరెడ్డి – అపర్ణ గార్ల వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వివాహ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆప్యాయంగా ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ప్రేమానురాగాలతో నిండి ఉండాలని ఆకాంక్షించారు. నూతన దంపతులకు హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.




