Rayachoti: ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్
Rayachoti: రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్‌లో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించి బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు.
Rayachoti: ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్
రాయచోటి: ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని స్టేట్ గెస్ట్ హౌస్ లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు.
ప్రజా దర్బార్ కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంత్రి రాంప్రసాద్ రెడ్డి అర్జీలను స్వీకరించి వారి సమస్యలపై ఆరా తీశారు.
ప్రజా దర్బార్ లో వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా దర్బార్ కార్యక్రమంతో ఎన్నో ప్రజా సమస్యలను పరిష్కరించడం జరిగిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.




