Rayachoti: రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్!
Rayachoti: రాయచోటి నియోజకవర్గంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్. చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలో ప్రజల సమస్యలను విని పరిష్కారానికి ఆదేశాలు.
Rayachoti: రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్!
Rayachoti: రాయచోటి ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు. చిన్నమండెం మండలం బోరెడ్డి గారి పల్లెలోని తన స్వగృహంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రజా దర్బార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలు మంత్రివర్యులను కలిసి తమ సమస్యలు, వినతులను వివరించారు. ప్రతి ఒక్కరి సమస్యను సావధానంగా విన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే తన లక్ష్యమని మంత్రి తెలిపారు.




