Rayachoti: బెంగళూరులో పెళ్లి వేడుకల్లో పాల్గొన్న మంత్రి మండిపల్లి!

Rayachoti: బెంగళూరు వీరడెన్సీ రిసార్ట్‌లో జయవర్ధన్ రెడ్డి - శ్రావ్యా రెడ్డిల పెళ్లి. కుటుంబ సమేతంగా హాజరై ఆశీర్వదించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 30 Aug 2026 5:04 PM IST
Rayachoti
X

Rayachoti: బెంగళూరులో పెళ్లి వేడుకల్లో పాల్గొన్న మంత్రి మండిపల్లి!

Rayachoti: బెంగళూరులోని వీరడెన్సీ రిసార్ట్‌లో చిలకం మధుసూదన్ రెడ్డి గారు – ఛాయావతి గారి కుమారుడు జయవర్ధన్ రెడ్డి, రాజ్యలక్ష్మి – సోమశేఖర్ రెడ్డి గారి కుమార్తె శ్రావ్యా రెడ్డిల పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ ఆత్మీయ పెళ్లి వేడుకలకు మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అలాగే మంత్రి సోదరుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి తో పాటు మంత్రి మేనల్లుడు మౌర్య రెడ్డి కూడా కుటుంబ సమేతంగా ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయవర్ధన్ రెడ్డి, శ్రావ్యా రెడ్డిలను ఆత్మీయంగా పలకరించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.

కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయులు మరియు సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లి వేడుకలు ఎంతో ఆత్మీయంగా, ఆనందోత్సాహాల మధ్య వైభవంగా సాగాయి. నూతన వధూవరులకు ఇరువురు సోదరులు తో పాటు మేనల్లుడు హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story