Rayachoti: వివాహ వేడుకలో కుటుంబ సమేతంగా పాల్గొన్న మంత్రి మండిపల్లి!
Rayachoti: రాయచోటి అభి ఫంక్షన్ హాల్లో జరిగిన ముంగర శివప్రసాద్ రాజు కుమార్తె అనూష వాణి, చరణ్‌ల వివాహ వేడుకలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీర్వదించారు.
Rayachoti: వివాహ వేడుకలో కుటుంబ సమేతంగా పాల్గొన్న మంత్రి మండిపల్లి!
రాయచోటి: అభి ఫంక్షన్ హాల్లో ముంగర శివప్రసాద్ రాజు గారి కుమార్తె అనూష వాణి, చరణ్‌ల వివాహ వేడుక వైభవంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తన సతీమణి, చిన్నమండెం మండల ఎంపీపీ మండిపల్లి హరిత రెడ్డి గారితో, మంత్రి తల్లిగారు సుశీలమ్మ గారు, మంత్రి సోదరి శ్రీలత రెడ్డి గార్లతో కలిసి కుటుంబ సమేతంగా హాజరయ్యారు.
అదేవిధంగా చిన్నమండెం మండలం జడ్పీటీసీ డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు కూడా వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు అనూష వాణి, చరణ్‌లను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి నూతన వైవాహిక జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, పరస్పర అనురాగం, ఆనందాలతో నిండి కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు.




