Rayachoti: ఎంపీటీసీ నామినేషన్ కేంద్రం వద్ద డ్రోన్లతో కట్టుదిట్టమైన నిఘా!

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ నామినేషన్ల కేంద్రం వద్ద డీఎస్పీ కృష్ణమోహన్ పర్యవేక్షణలో డ్రోన్లతో పటిష్ట నిఘా, బందోబస్తు ఏర్పాటు చేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 22 Oct 2026 10:08 PM IST
Rayachoti
X

Rayachoti: ఎంపీటీసీ నామినేషన్ కేంద్రం వద్ద డ్రోన్లతో కట్టుదిట్టమైన నిఘా!

రాయచోటి: అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్,. గారి ఆదేశాల మేరకు రాయచోటి ఎంపీడీవో కార్యాలయంలోని ఎంపీటీసీ నామినేషన్ల కేంద్రం వద్ద డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ల ప్రక్రియ శాంతియుతంగా సాగేందుకు కేంద్రం పరిసరాల్లో 100 మీటర్ల మేర ఆంక్షలు విధించడంతో పాటు, డ్రోన్ కెమెరాలు మరియు సీసీటీవీల ద్వారా నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.

ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టి, ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ సజావుగా ముగిసేందుకు అభ్యర్థులు, ప్రజలందరూ పోలీసు యంత్రాంగానికి పూర్తిస్థాయిలో సహకరించాలని అధికారులు కోరారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI