Rayachoti: సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన నిశ్చల్ నాగిరెడ్డి
Rayachoti: రాయచోటిలో రూ.35 లక్షలతో జరుగుతున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన నిశ్చల్ నాగిరెడ్డి. నాణ్యతలో రాజీ పడొద్దని కాంట్రాక్టర్‌కు ఆదేశం.
Rayachoti: సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన నిశ్చల్ నాగిరెడ్డి
రాయచోటి: రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని సుద్దలవాండ్లపల్లి రోడ్డు నుండి రాజు సీబీఎస్ఈ స్కూల్ మీదుగా అయ్యప్ప స్వామి గుడి వరకు దాదాపు రూ.35 లక్షలు వ్యయంతో సిమెంట్ రోడ్డు నిర్మాణం జరుగుతున్నది.
ఈ సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి నాణ్యతను పరిశీలించి, నాణ్యత విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి కి సూచించినారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




