Annamayya: చెరువు వద్ద క్షుద్ర పూజలు.. ఆ బొమ్మ ఏంటి?

Annamayya: అన్నమయ్య జిల్లా రాయచోటిలో క్షుద్ర పూజల కలకలం.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 5 May 2026 11:53 AM IST
Annamayya
X

Annamayya: చెరువు వద్ద క్షుద్ర పూజలు.. ఆ బొమ్మ ఏంటి?

Annamayya: అన్నమయ్య జిల్లా రాయచోటిలో క్షుద్ర పూజలు కలకలం రేగిత్తిస్తున్నాయి. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి నివాసం ఉంటున్న ఎస్పీ బంగ్లా కు అతి దగ్గరలో ఉన్న ఇనాయత్ ఖాన్ చెరువు వద్దగుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. ముగ్గు వేసి బొమ్మ (ప్లాస్టిక్ బొమ్మ పెట్టి) పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, దీపాలు వెలిగించి క్షుద్ర పూజలు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇనాయత్ ఖాన్ చెరువు ను క్షుద్ర పూజలకు కేంద్రంగా చేసుకొని అక్కడ నిత్యం క్షుద్ర పూజలు చేస్తున్నారు. దీంతో రాయచోటి పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story