Rayachoti: పప్పిరెడ్డి మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

Rayachoti: రాయచోటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. పప్పిరెడ్డి మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో పూజలు, భారీ బైక్ ర్యాలీ, కేక్ కటింగ్ మరియు రక్తదాన శిబిరం.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 2 Sept 2026 3:39 PM IST
Rayachoti
X

Rayachoti: పప్పిరెడ్డి మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

Rayachoti: డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను రాయచోటిలో జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పప్పిరెడ్డి మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందిన గుండాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆలయం నుంచి మాసాపేట, ఠాణా సర్కిల్, నేతాజీ కూడలి, శివాలయం చెక్‌పోస్ట్ మీదుగా మదనపల్లె రోడ్డులోని పార్టీ కార్యాలయం వరకు డీజే సౌండ్‌లతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యాలయానికి చేరుకున్న అనంతరం భారీ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పప్పిరెడ్డి మహేశ్వర రెడ్డి రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అదేవిధంగా పార్టీ కార్యాలయంలో బుల్లెట్ విజయ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సేవా కార్యక్రమాలకు జనసేన శ్రేణులు ప్రాధాన్యత ఇస్తున్నట్లు నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయచోటి నియోజకవర్గం సీనియర్ జనసేన నాయకులు బుడ్డా నాగభూషణ, జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story