Rayachoti: రాయచోటిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Rayachoti: రాయచోటిలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. పాల్గొన్న ప్రజాసంఘాల నాయకులు, స్థానికులు.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 15 Aug 2026 11:53 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

రాయచోటి: ప్రజాసంఘాల ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు, ప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులు, త్యాగమూర్తుల సేవలను నాయకులు స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని పేర్కొన్నారు. వారి ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చూపిన సమానత్వం, సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సోదరభావం వంటి విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.

దేశ సమైక్యత, సమగ్రతను కాపాడుతూ ప్రజలందరూ బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించాలని నాయకులు కోరారు. అనంతరం పాల్గొన్న వారికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు, సభ్యులు, వివిధ వర్గాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story