Rayachoti: అంతర్ జిల్లా బైక్ దొంగలు అరెస్ట్.. 7 బైక్‌లు స్వాధీనం!

Rayachoti: అన్నమయ్య, కడప, అనంతపురం జిల్లాల్లో బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసిన రాయచోటి పోలీసులు. 7 ద్విచక్ర వాహనాలు స్వాధీనం.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 15 Aug 2026 10:33 AM IST
Rayachoti
X

Rayachoti: అంతర్ జిల్లా బైక్ దొంగలు అరెస్ట్.. 7 బైక్‌లు స్వాధీనం!

Rayachoti: ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అన్నమయ్య జిల్లా రాయచోటి అర్బన్ పోలీసులు అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి 7 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం తూముకుంట గ్రామానికి చెందిన మావిళ్ళ వీరారెడ్డి అలియాస్ వీరారెడ్డి నాయుడు (45), కోటకొండ ఆంజనేయులు అలియాస్ గుండు (40) అనే ఇద్దరు దొంగలు అన్నమయ్య, కడప, అనంతపురం జిల్లాలలో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్నట్లు గుర్తించామని రాయచోటి డిఎస్పి కృష్ణమోహన్ తెలిపారు.

ఈ ఇద్దరు నిందితుల పై ఇదివరకే అన్నమయ్య, కడప, అనంతపురం జిల్లాలలోని 31 ద్విచక్ర వాహనాల చోరీ కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు. మావిళ్ళ వీరారెడ్డి అలియాస్ వీరారెడ్డి నాయుడు ఓ చోరీ కేసులో అరెస్టై జైలు కు వెళ్లి 6 నెలల క్రితమే బెయిల్ పై విడుదలై అదే గ్రామానికి చెందిన కోటకొండ ఆంజనేయులు అలియాస్ గుండు తో కలిసి మరోమారు ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతూ వచ్చారని డిఎస్పి కృష్ణమోహన్ రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story