Rayachoti: రాయచోటిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

Rayachoti: రాయచోటిలో పేకాట ఆడుతున్న 15 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. నగదు, 14 సెల్‌ఫోన్లు, 9 మోటార్ సైకిళ్లు స్వాధీనం. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల హెచ్చరిక.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 16 Aug 2026 9:05 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

రాయచోటి: రాయచోటి పట్టణంలోని శివాలయం సమీపంలో పేకాట ఆడుతున్న స్థావరంపై రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ శ్రీ విష్ణువర్ధన్ గారు, జిల్లా ఎస్పీ సిబ్బందితో కలిసి సంయుక్తంగా దాడి నిర్వహించారు.

ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 15 మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి పేకాటకు ఉపయోగిస్తున్న రూ.9,300/- నగదు, 14 సెల్‌ఫోన్లు మరియు 9 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ప్రజలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

రాయచోటి పట్టణంలో అసాంఘిక మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసుల ప్రత్యేక నిఘా కొనసాగుతుందని రాయచోటి అర్బన్ సి ఐ వెంకట చలపతి తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story