Rayachoti: రాయచోటిలో రాత్రివేళ పోలీసుల ఆంక్షలు కఠినతరం!
Rayachoti: రాయచోటిలో రాత్రి 10.30 దాటితే రోడ్లపై తిరిగే వారిపై పోలీసులు నిఘా పెట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలుంటాయని హెచ్చరించి, యువతకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
Rayachoti: రాయచోటిలో రాత్రివేళ పోలీసుల ఆంక్షలు కఠినతరం!
Rayachoti: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రాయచోటి పట్టణంలో రాత్రివేళ పోలీసులు ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. రాత్రి 10.30 గంటల తర్వాత వ్యాపార సముదాయాలను మూసివేయడంతో పాటు, అనవసరంగా రోడ్లపై తిరిగే వాహనదారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. రాయచోటి డివిజన్ డీఎస్పీ కృష్ణమోహన్, అర్బన్ సీఐ వెంకట చలపతి ఆదేశాల మేరకు అర్బన్ ఎస్‌ఐ చండ్రాయుడు ఆధ్వర్యంలో పోలీసులు రాత్రివేళల్లో పట్టణంలోని ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు.
రాత్రి 10.30 గంటల తర్వాత ద్విచక్ర వాహనాలపై అనవసరంగా సంచరిస్తున్న యువతను పోలీసులు గుర్తించి, వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అర్ధరాత్రి వేళల్లో అవసరం లేకుండా రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ హెచ్చరించారు.
ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే రాత్రివేళ ఈ ఆంక్షలను అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. అత్యవసర పరిస్థితులు మినహా అనవసరంగా రోడ్లపై సంచరించకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. వ్యాపారులు కూడా నిర్ణీత సమయానికి దుకాణాలు, వ్యాపార సముదాయాలను మూసివేసి పోలీసులకు సహకరించాలని సూచించారు....




