Galiveedu: నూలివీడులో వైసీపీకి షాక్.. టీడీపీలోకి 100 కుటుంబాలు!
Galiveedu: గాలివీడు మండలం నూలివీడు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రధాన అనుచరులతో సహా 100 కుటుంబాలు టీడీపీలో చేరాయి.
Galiveedu: నూలివీడులో వైసీపీకి షాక్.. టీడీపీలోకి 100 కుటుంబాలు!
గాలివీడు: మంగళవారం రోజు మధ్యాహ్నం గాలివీడు మండలం నూలువీడు గ్రామంలో వైఎస్సార్‌సీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి ప్రధాన అనుచరులుగా ఉన్న నూలివీడు గ్రామ YCP నాయకులు,కార్యకర్తలు వైఎస్సార్‌సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
నూలివీడు శివారెడ్డి&ఫరీద్ ఆధ్వర్యంలో 100 కుటుంబాలకు పైగా టీడీపీ కండువాలు కప్పుకుని తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ నియోజకవర్గ టిడిపి నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు కండువాలు కప్పి సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో రోజురోజుకూ విశ్వాసం పెరుగుతోందని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరుతున్నారని తెలిపారు.
తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరినీ సాదరంగా ఆహ్వానిస్తూ, వారికి పార్టీలో సముచిత గౌరవం కల్పిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. రాయచోటి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు కుమార్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ శివారెడ్డి,రియాజ్,ధర్మారెడ్డి, శివారెడ్డి,నూలివీడు మైనార్టీ నాయకుడు ఫరీద్, లక్షుమయ్య, ఉదయ్ మరియు తదితర టీడీపీ నాయకులతో పాటు మండల నాయకులు, గ్రామ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




