Rayachoti: చమర్తి సుబ్బరాజు భౌతికకాయానికి సుగవాసి ప్రసాద్ బాబు నివాళి!
Rayachoti: రాజు స్కూల్స్ వ్యవస్థాపకులు చమర్తి సుబ్బరాజు పార్థివదేహానికి రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు పూలమాల వేసి నివాళులర్పించారు.
Rayachoti: చమర్తి సుబ్బరాజు భౌతికకాయానికి సుగవాసి ప్రసాద్ బాబు నివాళి!
రాయచోటి: రాయచోటి రాజు స్కూల్స్ వ్యవస్థాపకులు, రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారి తండ్రి, కీర్తిశేషులు శ్రీ చమర్తి సుబ్బరాజు గారి పార్థివదేహానికి గురువారం సాయంత్రం రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చమర్తి జగన్మోహన్ రాజు గారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. విద్యారంగంలో విశేష సేవలందించిన చమర్తి సుబ్బరాజు గారి మరణం తీరని లోటని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కీర్తిశేషులు చమర్తి సుబ్బరాజు గారికి నివాళులర్పించారు. ? కీర్తిశేషులు చమర్తి సుబ్బరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.




