Rayachoti: హాకీకా వేడుకలో పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు
Rayachoti: రాయచోటిలో నిర్వహించిన షేక్ అర్షదూర్ రహమాన్ హాకీకా కార్యక్రమానికి రాజంపేట పార్లమెంట్ టీడీపీ ప్రెసిడెంట్ సుగవాసి ప్రసాద్ బాబు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.
Rayachoti: హాకీకా వేడుకలో పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు
రాయచోటి: రాయచోటి పట్టణంలోని మదనపల్లి రోడ్డులో గల PCR ఫంక్షన్ హాల్‌లో షేక్ అర్షదూర్ రహమాన్ గారి హాకీకా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ శుభకార్యక్రమానికి రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి, వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా చిన్నారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, నిండు నూరేళ్లు ఆనందంగా జీవిస్తూ ఉన్నతంగా ఎదగాలని సుగవాసి ప్రసాద్ బాబు గారు ఆకాంక్షించారు.
చిన్నారి భవిష్యత్తు ఆనందమయం కావాలని, కుటుంబ సభ్యులందరికీ సుఖసంతోషాలు, శాంతి సమృద్ధులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
Next Story




