Rayachoti: సుగవాసి ప్రసాద్ బాబును సత్కరించిన నూతన జడ్పీటీసీలు
Rayachoti: రాయచోటి టీడీపీ కార్యాలయంలో ఘన విజేత సుగవాసి ప్రసాద్ బాబును కలిసిన జడ్పీటీసీలు తలారి శరణ్య, సురేంద్ర యాదవ్. పరస్పరం శాలువాలతో ఘనంగా సత్కారం.
Rayachoti: సుగవాసి ప్రసాద్ బాబును సత్కరించిన నూతన జడ్పీటీసీలు
రాయచోటి: సోమవారం సాయంత్రం రాయచోటి పట్టణంలోని గాలివీడు రోడ్డులో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, గాలివీడు జడ్పీటీసీ సభ్యులుగా రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో చారిత్రాత్మక విజయం సాధించిన శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారిని నూతనంగా ఎన్నికైన పెద్దతిప్పసముద్రం జడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి తలారి శరణ్య గారు, కురబలకోట జడ్పీటీసీ సభ్యులు శ్రీ సురేంద్ర యాదవ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ప్రసాద్ బాబు గారికి శాలువా కప్పి, పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రసాద్ బాబు గారు కూడా నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులను శాలువాలు కప్పి ఆత్మీయంగా సన్మానించారు.
ప్రజల అపారమైన ఆదరణ… కార్యకర్తల అంకితభావం… నాయకుల సమిష్టి కృషి…
ఈ చారిత్రాత్మక విజయంపై నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ, ప్రజల ఆశలు మరియు ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని, గ్రామాల అభివృద్ధికి మరింత కృషి చేయాలని పరస్పరం ఆకాంక్షలు తెలియజేసుకున్నారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని సుగవాసి ప్రసాద్ బాబు గారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో మరింత ఉన్నతంగా ఎదగాలని… అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నారు.
సుగవాసి ప్రసాద్ బాబు గారు నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులు తలారి శరణ్య గారు, సురేంద్ర యాదవ్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.




