Rayachoti: రాయచోటి-కదిరి మార్గంలో బస్సుల కొరత ప్రయాణికుల తీవ్ర అవస్థలు!
Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి నుండి కదిరి మార్గంలో సరిపడా ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదనపు బస్సులు నడపాలని విజ్ఞప్తి.
Rayachoti: రాయచోటి-కదిరి మార్గంలో బస్సుల కొరత ప్రయాణికుల తీవ్ర అవస్థలు!
Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి నుండి కదిరి వెళ్లే మార్గంలో బస్సు సర్వీసులు సరిపడా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బస్సులు వచ్చిన సమయంలో ప్రయాణికుల రద్దీగా ,అధికంగా ఉండటంతో పలువురు నిల్చుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంటోంది.ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ మరింత పెరుగుతోందని ప్రయాణికులు చెబుతున్నారు.బస్సుల కొరత కారణంగా కొందరు ప్రయాణికులు ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది.
దీంతో ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడటంతో పాటు ప్రయాణం కూడా ఇబ్బందికరంగా మారుతోందని ప్రయాణికులు వాపోతున్నారు.కదిరి–రాయచోటి మార్గంలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేసి, బస్సుల సమయపాలనను మెరుగుపరచాలని ప్రయాణికులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.




