Rayachoti: శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానంలో ఘనంగా 70 వ తిరునక్షత్ర మహోత్సవం!
Rayachoti: రాయచోటి వీరభద్ర స్వామి దేవస్థానంలో శ్రీ చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవం సందర్భంగా శ్రీరామ హృదయం కలశ పూజ ఘనంగా జరిగింది.
Rayachoti: శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానంలో ఘనంగా 70 వ తిరునక్షత్ర మహోత్సవం!
రాయచోటి: శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి 70వ తీరు నక్షత్రం మహోత్సవం కార్యక్రమం రాయచోటి లోని శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానంలో 70వ తిరునక్షత్ర మహోత్సవం శ్రీరామ హృదయం కలస పూజ కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణాధికారి డి.వి.రమణారెడ్డి, చైర్మన్ మనోజ్ కుమార్, పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో తిరు నక్షత్ర మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది.
అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలోని 54 మండలాల లోని కలశాలకు అర్చకులు శ్రీ యోగి స్వామి,శ్రీ శంకర స్వామిలు భక్తిశ్రద్ధలతో పూజ చేశారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు రాయచోటి నాయకులు శ్రీ డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. 54 మండలాల్లోని కన్వీనర్లకు కలశాలను ఈ సందర్భంగా అందజేశారు.
డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి వారి మంగళ శాసనాలతో ప్రతిభక్తుని హృదయాన్ని తాకించే విధంగా లోక క్షేమం కోసం కలసపూజ కార్యక్రమం స్వామీజీలు చేపట్టి నిర్వహించడం ఆనందించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ మదన్ మోహన్, శ్రీ మహేష్ యాదవ్ గారు, శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారు , శ్రీ తుమ్మల హరినాథ్ గారు వివిధ మండలాల నుంచి వచ్చిన భక్తులు, కన్వీనర్లు, కళాకారులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




