Rayachoti: రాయచోటిలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల బైక్ ర్యాలీ

Rayachoti: 2010కి ముందు సర్వీస్‌లో చేరిన ఉపాధ్యాయులకు టెట్ నిబంధనను సవరించాలని కోరుతూ అన్నమయ్య జిల్లా రాయచోటిలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 27 Aug 2026 7:47 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల బైక్ ర్యాలీ

రాయచోటి: 2010 కంటే ముందు సర్వీస్ లో చేరిన ఉపాధ్యాయులు కూడా ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నందు ఉత్తీర్ణత సాధించాలన్న విద్యా హక్కు చట్ట నిబంధనను సవరించి ఉపాధ్యాయుల ఆందోళనను తొలగించుటకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జాబిర్ డిమాండ్ చేశారు.

ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా సాధారణ టెట్టుకు ప్రత్యేక టెట్ కు ఎటువంటి తేడా లేదని నిరసిస్తూ ఈరోజు సాయంత్రం అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్( యుటిఎఫ్ ) బైక్ ర్యాలీ రింగ్ రోడ్డు నుండి శివాలయం, బంగ్లా,బస్టాండ్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యాహక్కు చట్ట నిబంధన 23(1) తొలగించుటకు కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అలా జరగని పక్షంలో ఉపాధ్యాయుల కొరకు ప్రత్యేక టెట్ నిర్వహించే సందర్భంగా పరీక్షను ఆఫ్ లైన్ లో నిర్వహించాలని, అర్హత మార్కులను అన్ని సామాజిక వర్గాల ఉపాధ్యాయులకు 40 శాతంగా నిర్ణయించాలని, ఉపాధ్యాయుడు బోధించే సబ్జెక్టు మేరకే సిలబస్ ను పరిమితం చేయాలని కోరారు.

ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనేది ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించే అభ్యర్థులకు పరీక్ష పెట్టడానికి ఎటువంటి అభ్యంతరం లేదని అయితే ఇప్పటికే ఉపాధ్యాయుడుగా వివిధ రకాల పోటీ పరీక్షలలో నెగ్గి ఉద్యోగంలో సేవలు అందిస్తున్న వారికి మళ్లీ పరీక్ష నిర్వహించాలనేది సహేతుకమైనది కాదని తెలిపారు.

2010కు ముందు ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులు కూడా టెట్ రాయాలని నిబంధనలను నిరసిస్తూ ఇప్పటికే అనేక రూపాల్లో నిరసనలు తెలియజేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయం అన్నారు. ప్రభుత్వ వైఖరి ఇలాగే కొనసాగితే సెప్టెంబర్ మూడవ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని అప్పటికి సమస్య పరిష్కారం కాని పక్షంలో సెప్టెంబర్ 4 నుండి విజయవాడ కేంద్రంగా నిరాహార దీక్షలు చేపడతామని తెలిపారు.

ఉపాధ్యాయుల్లో ఉన్న ఆందోళనను, భయాన్ని పరిగణలోకి తీసుకొని టెట్టు రద్దు చేయాలని లేదా మినహాయింపులతో ప్రత్యేకత టెట్ నిర్వహించాలని కోరారు. ఈ బైక్ ర్యాలీలో జిల్లా కార్యదర్శులు శివారెడ్డి, దావుద్దీన్, చంద్రశేఖర్ రెడ్డి, జిక్రియా,వివిధ మండలాల నాయకులు రాజా రమేష్, హాఫిజుల్లా, మస్తాన్, అమీన్, కిఫాయాతుల్లా, నరసింహ రెడ్డి, రాఖిబ్, షార్ఫుద్దీన్, ఇలియాస్, మన్సూర్, గౌస్, రెడ్డి ముని సుధాకర్, ఉమా శంకర్ మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story