Rayachoti: వీరభద్రస్వామి ఆలయంలో ఘనంగా నాగులచవితి వేడుకలు!

Rayachoti: రాయచోటి వీరభద్రస్వామి ఆలయంలో నాగులచవితి సందర్భంగా పుట్ట వద్ద పాలు, చలిమిడితో ప్రత్యేక పూజలు. పాల్గొన్న ఈఓ రమణారెడ్డి, చైర్మన్ తిరుమల రావు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 16 Aug 2026 3:32 PM IST
Rayachoti
X

Rayachoti: వీరభద్రస్వామి ఆలయంలో ఘనంగా నాగులచవితి వేడుకలు!

Rayachoti: రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో ఘనంగా శ్రావణ శుద్ధ చవితి సందర్భంగా నాగుల చవితికి ఆలయంలోని పుట్ట వద్ద నాగులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు సర్ప పుట్ట వద్ద పాలు, చలిమిడి, చిమ్మిలి (నువ్వుల ఉండలు), అరటిపండ్లును సమర్పించిన భక్తులు.సర్ప దోషాలు, కాలసర్ప దోషాలు, రాహు-కేతు దోషాలు తొలగిపోతాయని భక్తులు నమ్మకం.

నాగుల చవితి సందర్బంగా నాగుల పుట్ట ను పూజిస్తే సంతాన సౌభాగ్యం కలిగి , కుటుంబం సుభిక్షంగా ఉంటుందని భక్తులకు తెలిపిన ఆలయ అర్చకులు.పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు ఇచ్చిన ఆలయ ఈవో డివి రమణారెడ్డి, చైర్మన్ తిరుమల రావు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story