Rayachoti: రాయచోటి వైఎస్ఆర్ సీపీ ఆఫీస్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ!
Rayachoti: రాయచోటి వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన పార్టీ నాయకులు.
Rayachoti: రాయచోటి వైఎస్ఆర్ సీపీ ఆఫీస్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ!
Rayachoti: రాయచోటి వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.మాజీ మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష,ప్రజా ప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
స్వాతంత్య్ర సమర యోధులును స్మరించుకుని, వారి బాటలో నడవాలని వారు ప్రతినబూనారు. అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లు పంచిపెట్టారు.
మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజర్ రెహమాన్, వైఎస్ఆర్ సిపి పట్టణ అధ్యక్షుడు నవాజ్,బిసి సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయభాస్కర్, మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి షబ్బీర్, మున్సిపల్ విభాగపు రాష్ట్ర కార్యదర్శి రియాజుర్ రెహమాన్, నాయకులు గౌస్ ఖాన్,సుగవాసి శ్యామ్, సాదిక్, జనతా బషీర్, మాజీ కౌన్సిలర్ ఆనంద రెడ్డి,వాల్మీకి సంఘ అధ్యక్షుడు గువ్వల బుజ్జిబాబు,ఎస్ సి సెల్ జిల్లా అధ్యక్షుడు చుక్కా అంజనప్ప, మాజీ కో ఆప్షన్ హజరత్ ఖాదర్ వలీ, ఖలీల్, యూసుఫ్ ఖాన్,రవూఫ్ జయచంద్రా రెడ్డి, రైతుమిత్ర ఖాదర్ బాష,ఆప్ఝల్ అంజాద్,హాబీబ్,జిలాన్ తదితరులు పాల్గొన్నారు.




