Rayachoti: ఎంపీపీ మండిపల్లి హరితమ్మను మర్యాదపూర్వకంగా కలిసిన జడ్పీటీసీ కరుణ!
Rayachoti: రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలో ఎంపీపీ మండిపల్లి హరితమ్మను కలిసి సన్మానించిన సంబెపల్లి జడ్పీటీసీ మల్లు కరుణ.
Rayachoti: ఎంపీపీ మండిపల్లి హరితమ్మను మర్యాదపూర్వకంగా కలిసిన జడ్పీటీసీ కరుణ!
Rayachoti: రాయచోటి సంబెపల్లి జడ్పీటీసీ మల్లు కరుణ మర్యాదపూర్వకంగా ఎంపీపీ మండిపల్లి హరితమ్మ కలిసి ఘన సన్మానం. చిన్నమండెం మండలం బోరెడ్డి గారి పల్లెలోని మంత్రి నివాసంలో చిన్నమండెం ఎంపీపీ మండిపల్లి హరితమ్మ గారిని సంబెపల్లి జడ్పీటీసీ మల్లు కరుణ గారు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఇరువురు పరస్పరం ఆత్మీయంగా మాట్లాడుకుంటూ, ప్రజా సేవ, స్థానిక అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రజాప్రతినిధుల మధ్య సుహృద్భావం, పరస్పర గౌరవం ప్రజా సేవకు మరింత బలాన్నిస్తాయని ఈ మర్యాదపూర్వక కలయిక చాటిచెప్పింది.
ఈ కార్యక్రమంలో సంబేపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




