Rayachoty: రాయచోటిలో బీఎల్ఓలకు ఓటర్ల జాబితా సవరణపై అవగాహన కార్యక్రమం
Rayachoty: అన్నమయ్య జిల్లా రాయచోటిలో బూత్ లెవెల్ అధికారులకు (BLOs) ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
Rayachoty: రాయచోటిలో బీఎల్ఓలకు ఓటర్ల జాబితా సవరణపై అవగాహన కార్యక్రమం
రాయచోటి: అన్నమయ్య జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు రాయచోటిలోని సాయి శుభ కళ్యాణ మండపంలో 128-రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ బూత్ లెవెల్ అధికారులకు (BLOs) ప్రత్యేక శిక్షణ (SIR) కార్యక్రమం నిర్వహించారు. రాయచోటి ఈఆర్ఓ మరియు ఆర్డీఓ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇంటింటి సర్వే, ఓటరు వివరాల ధృవీకరణ మరియు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో నియమ నిబంధనలను సమర్థవంతంగా అమలు చేస్తూ ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్లు, బీఎల్ఓలు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
Next Story




