Rayachoty: రాయచోటి బస్టాండ్ వద్ద ఇరువర్గాల ఘర్షణ – కేసులు నమోదు!

Rayachoty: రాయచోటి బస్టాండ్ ప్రాంతంలో బైక్ దహనం వివాదంపై ఘర్షణ పడిన ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు అర్బన్ ఎస్ఐ చలపతి వెల్లడించారు. నలుగురికి కౌన్సెలింగ్.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 7 Sept 2026 9:31 AM IST
Rayachoty
X

Rayachoty: రాయచోటి బస్టాండ్ వద్ద ఇరువర్గాల ఘర్షణ – కేసులు నమోదు!

Rayachoty: రాయచోటి పట్టణంలోని కొత్తపల్లి ప్రాంతంలో మోటార్‌సైకిల్‌ను కాల్చివేశారనే అంశంపై ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం అనంతరం రాయచోటి బస్టాండ్ ప్రాంతంలో జరిగిన ఘర్షణపై ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బి.వి. చలపతి తెలిపారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో మోటార్‌సైకిల్ దగ్ధం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఏర్పడిన వివాదమే అనంతరం బస్టాండ్ వద్ద ఇరువర్గాల ఘర్షణకు దారితీసినట్లు వెల్లడైంది. ఘటనకు సంబంధించి ఇరువర్గాలపై చట్టపరమైన నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి, పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా గొడవలకు పాల్పడినా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా సంబంధిత వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్ బి.వి. చలపతి హెచ్చరించారు. ప్రజలు ఏవైనా వివాదాలు తలెత్తినప్పుడు స్వయంగా ఘర్షణలకు దిగకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story