Rayachoty: ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్!

Rayachoty: రాయచోటి మార్కెట్ యార్డ్‌లో ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్ నిశాంత్ కుమార్. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి భద్రతా చర్యలను పరిశీలన.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 28 Oct 2026 9:26 PM IST
Rayachoty
X

Rayachoty: ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్!

రాయచోటి: అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద 24-7 ప్రకారం నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు మాసవారి తనిఖీలో భాగంగా.... రాయచోటి పట్టణం మార్కెట్ యార్డ్ లో ఉన్న ఈవీఎం గోదామును బుధవారం రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఈవీఎం గోడౌన్ లో అంతర్భాగాలను రాజకీయ పార్టీల సమక్షంలో గోదాము లోపల భద్రపరిచిన ఆయా ఈవీఎం యంత్రాలు బియులు, సియూలు, వివి ప్యాట్ లను, అక్కడి భద్రతా చర్యలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలన చేశారు. అనంతరం వివిధ అంశాలలో రాజకీయ పార్టీ ప్రతినిధులు అడిగిన సందేహాలకు కలెక్టర్ సమాధానం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, తాసిల్దార్ యామిని, కలెక్టరేట్ ఎలక్షన్ సెక్షన్ సూపరింటెండెంట్, సిబ్బంది , వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI