Rayachoty: కలిబండ పెద్ద చెరువు పనులకు శ్రీకారం చుట్టిన మండిపల్లి హరితమ్మ

Rayachoty:

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 1 Aug 2026 5:15 PM IST
Rayachoty
X

Rayachoty: కలిబండ పెద్ద చెరువు పనులకు శ్రీకారం చుట్టిన మండిపల్లి హరితమ్మ

రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం,కలిబండ గ్రామంలో కలిబండ పెద్ద చెరువు అభివృద్ధి పనులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి మండిపల్లి హరితమ్మ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల అభివృద్ధి ద్వారా రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడి వ్యవసాయానికి మరింత ఊతం లభిస్తుందని తెలిపారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రతి పనిని వేగంగా ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో చిన్నమండెం మండల అధ్యక్షులు మూగి రెడ్డప్ప స్థానిక గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,మండిపల్లి అభిమానులు,గ్రామ పెద్దలు, రైతులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story