Rayachoty: సబ్సిడీ ధరలకే బియ్యం పంపిణీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్

Rayachoty: రాయచోటి రైతు బజార్‌లో సబ్సిడీ బియ్యం పంపిణీ ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. బీపీటీ సూపర్ ఫైన్ కిలో రూ.52, రా రైస్ రూ.50 లకే లభ్యం.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 3 Aug 2026 7:47 PM IST
Rayachoty
X

Rayachoty: సబ్సిడీ ధరలకే బియ్యం పంపిణీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్

రాయచోటి: ప్రజలకు నాణ్యమైన వస్తువుల్ని అత్యంత సరసమైన ధరలకు అందించడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు రాయచోటి పరిధిలోని రైతు బజార్ వద్ద సబ్సిడీ ధరకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మార్కెట్లో బియ్యం ధరల నుండి పేదలకు ఉపసమనం కల్పించే లక్ష్యంతో రైస్ మిల్లులు, 130 రైతు బజార్ల వద్ద, 500 రైస్ మిల్లుల వద్ద సబ్సిడీ ధరలకు అందించడం జరుగుతోంది. బహిరంగ మార్కెట్లో బియ్యం సగటు రూ.60-65 మధ్య ఉన్నాయి.

ఆ భారాన్ని తగ్గించే లక్ష్యంతో బీపీటీ సూపర్ ఫైన్ రకం బియ్యాన్ని కిలో రూ. 52, బీపీటీ రా రైస్‌ను కిలో రూ. 50 చొప్పున విక్రయిస్తున్నారు. గుర్తింపు కార్డును చూపించి ప్రతి ఒక్కరూ గరిష్టంగా 10 కిలోల వరకు బియ్యం కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించాం.

నిత్యావసరాల ధరల నియంత్రణకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి పని చేస్తోంది. అవసరమైతే రైతు బజార్లలో అన్ని రకాల సరుకులు కూడా అందుబాటులో ఉంచుతాం. వీలైనంత వరకు ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో ఉంచే లక్ష్యంతో పని చేస్తున్నాం.

ప్రజల కోసం పని చేస్తున్నది ఎవరో.. ప్రజలతో రాజకీయం చేసి జేబులు నింపుకుంటున్నది ఎవరో ప్రజలు గుర్తించాలని మంత్రి విన్నవించారు. కార్యక్రమంలో డిస్టిక్ సివిల్ సప్లై ఆఫీసర్ రెడ్డి చంద్రిక,రాయచోటి RDO, MRO, పౌరసరఫరాల అధికారులు మండల నాయకులు,తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story