Rayachoty: వినాయక మండపాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి

Rayachoty: రాయచోటిలో వినాయక మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలుంటాయని అర్బన్ సీఐ బి.వి. చలపతి హెచ్చరించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 7 Sept 2026 11:53 PM IST
Rayachoty
X

Rayachoty: వినాయక మండపాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి

రాయచోటి: రాయచోటి పట్టణంలో వినాయక మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు ముందుగా సంబంధిత శాఖల నుంచి అనుమతులు పొందాలని అర్బన్ సీఐ బి.వి. చలపతి సూచించారు.

విద్యుత్ శాఖ, ఫైర్ డిపార్ట్‌మెంట్, మైక్/లౌడ్‌స్పీకర్ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. అనుమతులు లేకుండా మండపాలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

శాంతిభద్రతలకు, ట్రాఫిక్‌కు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story